Andhra PradeshBreaking NewsHome Page Slider

జ‌గ‌న్ మ‌ళ్లీ ఫైర్ అయ్యాడు

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో స్పందించారు.బుధ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు,డిసిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి వ్యాఖ్య‌లైతే చేశారో స‌రిగ్గా అలానే విరుచుకుప‌డ్డారు.కొన్నాళ్ల పాటు ద‌త్త‌పుత్రుడు అనే మాటను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్‌….మ‌ళ్లీ ఇవాళ ద‌త్త‌పుత్రుడంటూ ఫైర్ అయ్యారు.గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌,బ‌డ్జెట్‌పై తొలిసారిగా జ‌గ‌న్ స్పందించారు.

✳️ చంద్ర‌బాబు రెండు బ‌డ్జెట్ల‌లోనూ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడు
✳️మ‌హిళ‌ల‌కు రూ.36వేలు చొప్పున బాకీప‌డ్డాడు
✳️ఉచిత బ‌స్సు హామీ ప‌థ‌కాన్ని ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌లేదు
✳️ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం కింద మ‌హిళ‌ల‌కు రూ.7వేల కోట్ల బ‌కాయిప‌డ్డాడు
✳️రాష్ట్రానికి కంపెనీలు వ‌చ్చే ప‌రిస్థితి లేకుండా చేశాడు
✳️కంపెనీల‌ను భ‌య‌పెట్టేస‌రికి పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోయాయి
✳️అన్న‌దాత సుఖీభ‌వ కింద కేంద్రం ఇచ్చే రూ.20వేలు కాకుండా అద‌నంగా రూ.20వేలు ఇస్తాన‌న్నాడు.అదీ లేదు.
✳️53ల‌క్ష‌ల రైతుల‌కు రూ.10,717 కోట్లు అవ‌స‌రం కాగా…బడ్జెట్‌లో కేవ‌లం రూ.6వేల కోట్లు కేటాయించారు
✳️ఎన్నిక‌ల‌ప్పుడు సూప‌ర్ 6 , 7 అన్నాడు.అందులో ఏ ఒక్క‌టీ అమ‌లు చేయ‌లేదు.
✳️మీకు 45వేలు…మీకు 15వేలంటూ ఊద‌ర‌గొట్టారు
✳️కొత్త పెన్ష‌న్ల కోసం 20ల‌క్ష‌ల కుటుంబాల‌కు రూ.4వేలు చొప్పున మ‌హా అయితే రూ.3500 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది.అంత‌కు మించి కాదు క‌దా?మ‌రి వీళ్ల‌కు ఎందుకు పెన్ష‌న్ ఇవ్వ‌డం లేదు?
✳️ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ప్ర‌స్తావ‌న లేదు
✳️అధికారానికి వ‌చ్చాక‌….కొత్త ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోగా ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు
✳️ప్ర‌తీ పిల్ల‌వాడికి చంద్ర‌బాబు బాకీ ప‌డ్డాడు
✳️ఈ పెద్ద‌మ‌నిషికి అస‌లు బుద్దుందా అని నేను అడుగుతున్నా…
✳️ప్ర‌జ‌ల సొమ్ముతో ప్ర‌భుత్వాన్ని నడుపుతూ… వైసీపి వాళ్ళ‌కి సంక్షేమ ప‌థ‌కాలు ఇవ్వ‌ద్ద‌ని చెబుతాడా?
✳️సీఎం గా ప్ర‌మాణం చేసేట‌ప్పుడు …రాగ‌ద్వేషాలు లేకుండా పాలిస్తాన‌ని చెప్పి…ఇప్పుడు వైసీపి వాళ్ళ‌కి ప‌థ‌కాలు అందిస్తే పాముకి పాలుపోసిన‌ట్లు అనే వ్యాఖ్య‌లు చేస్తాడా? ఇది ధ‌ర్మ‌మేనా అని అడుగుతున్నా?
✳️ఇలాంటి ముఖ్య‌మంత్రులు దేవుడు సాక్షిగా ప్ర‌మాణం చేసి ప‌రిపాల‌న చేయ‌డం ఏ రాష్ట్రానికైనా శ్రేయ‌స్క‌రం కాదు.
✳️ఉన్న పెన్ష‌న్ల‌న్నీ తొల‌గించారు.ఇప్ప‌టికే 4ల‌క్ష‌ల పెన్ష‌న్లు తొల‌గించారు.
✳️త‌మ ప్ర‌భుత్వంలో ప్ర‌తీ నెలా రూ.32వేల కోట్ల మేర పెన్ష‌న్లు పంపిణీ చేశాం.కానీ చంద్ర‌బాబు హ‌యాంలో రూ.5వేల కోట్లు త‌గ్గించి రూ.27వేల కోట్ల‌కు ప‌రిమితం చేశారు.
✳️అంటే ఎన్నివేల పెన్ష‌న్లు త‌గ్గించారో ఆలోచించండి.
✳️పెట్రోల్ డీజిల్ త‌గ్గిస్తానంటాడు…స‌ముద్రాన్ని కంట్రోల్ చేస్తానంటాడు…వ‌డ్డీలేని రుణాలు రూ.10ల‌క్ష‌లు ఇస్తాన‌న్నాడు.సున్నా వ‌డ్డీ రుణాలు కూడా ఎగ్గొట్టాడు.
✳️హెవీ లైసెన్స్ డ్రైవ‌ర్ల‌కు నెల‌కు రూ.15వేలు ఇస్తాన‌ని మోసం చేశాడు.మేమున్న‌ప్పుడు వాహ‌న‌మిత్ర కింద రూ.10వేలు ఇచ్చాం.ఇప్పుడు అదీ లేదు.
✳️ముస్లిం మైనార్టీ కార్పొరేష‌న్ ద్వారా రుణాలు ఇస్తాన‌న్నాడు.ఇవి కాక 145 హామీలు ఇస్తాన‌ని మోసం చేశాడు.
✳️రాష్ట్రంలో ఇప్పుడు ప్ర‌తీ ఇంటా ఒక‌టే చ‌ర్చ జ‌రుగుతుంది.జ‌గ‌న్ ఉన్న‌ప్పుడే బాగుంది అని.బాబు బిర్యాని పెడ‌తాడ‌ని అంతా మోస‌పోయారు.ఇప్పుడు ప‌లావు పాయే…బిర్యానీ పాయే.
✳️చంద్ర‌బాబు అబ‌ద్దాల‌పై తాము నిర‌వ‌ధిక పోరాటం చేస్తాం.ప్ర‌జ‌ల‌కు బాబు ఇచ్చిన అబ‌ద్ద‌పు హమీల‌గురించి చెప్తాం.