తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
అకస్మాతుగా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు వైసీపీ నేత జగన్. గత మూడురోజులుగా జగన్ తిరుమల పర్యటన విషయంలో వివాదం నెలకొంది. లడ్డూ తిరుమల వివాదం నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటించారు జగన్. దీనితో డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేయాలంటూ హిందూసంఘాలు, టీడీపీ, బీజేపీ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా జగన్ పర్యటనకు అవాంతరాలు కలిగించకూడదని కూటమి ప్రభుత్వం తీర్మానించింది. శాంతియుతంగా ఆయన వెళ్లే మార్గంలో నిరసనలు తెలపాలని మాత్రమే ఆదేశించింది. అయితే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడానికి కారణాలు కాసేపట్లో వెల్లడిస్తారని మీడియా ముందుకు వస్తారని సమాచారం.