జగన్ 2.0 వేరే లెవల్….
ఏపి మాజీ సీఎం వైఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గురువారం జరిగిన వైసీపి కార్పొరేటర్ల సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. 2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బంపర్ మెజార్టీ ఇచ్చి సుపరిపాలన అందించమని దీవిస్తే … వైసీపి శ్రేణులే లక్ష్యంగా దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.గతంలో తాను సీఎం గా ఉన్నప్పుడు ప్రజల కోసం..పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేకపోయానని అంగీకరించారు.జగన్ 2.0 వేరే లెవల్ లో ఉండబోతుందని హెచ్చరించారు.వైసీపి శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని తెలిపారు.అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని చెప్పారు.మళ్లీ అధికారంలోకి వస్తున్నాం…మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండబోతున్నాం అని చెప్పడంతో సమావేశం దద్దరిల్లింది.