Home Page SliderNationalSportsviral

పుష్ప స్వాగ్‌తో జడేజా వీడియో..

ఎక్కడ ఎవరు విజయం సాధించినా ‘పుష్ప’ స్టైల్లో సంబరం చేసుకోవాల్సిందేనన్నంతగా ‘పుష్ప’ మూవీ ప్రజల్లోకి చొచ్చుకుని పోయింది. క్రికెట్ కూడా అందుకు మినహాయింపు కాదు. పైగా అధిక శాతం క్రికెటర్లు వికెట్లు తీసినప్పుడో, సెంచరీ కొట్టినప్పుడో పుష్ప స్టైల్‌లో అల్లు అర్జున్‌ని అనుకరించడం పరిపాటయిపోయింది. భారత్ ఆటగాళ్లే కాదు, విదేశీ ఆటగాళ్లు కూడా తగ్గేదేలే అంటున్నారు. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా జడేజ విన్నింగ్ షాట్ తర్వాత పుష్ప స్టైల్‌ను అనుకరించడం చూశాం. అయితే త్వరలో ఐపీఎల్ జరగనుండడంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా జడేజాతో పుష్ప బీజీఎంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకుంది. వైల్డ్ ఫైర్ కోసం తమ టీమ్ సిద్ధంగా ఉందంటూ ఇతర టీమ్స్‌కు ఛాలెంజ్ విసిరింది. ‘జడ్డూ అంటే బ్రాండ్’ అంటూ ఈ వీడియోను పంచుకుంది. ఇప్పటి దాకా అనేక మంది స్టార్ క్రికెటర్లు పుష్ప స్వాగ్‌ను అనుకరించారు. వీరిలో ఆస్ట్రేలియా బ్యాటర్ ‘డేవిడ్ వార్నర్’ అయితే పలుమార్లు బన్ని డ్యాన్సులను, స్టైల్‌ను అనుకరించారు. ఇంకా నితీశ్ కుమార్ రెడ్డి, డీజే బ్రావో, పాండ్యా శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా వంటి ఎందరో పుష్పకు ఫ్యాన్స్ ఉన్నారు.