Home Page SliderNational

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్న అయ్యర్

స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కాగా త్వరలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌తో శ్రేయాస్ అయ్యర్ టీమిండియా తరుపున ఆడే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే అయ్యర్‌పై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కూడా సానుకూలంగా ఉన్నారట. ఈ మేరకు ఆయన BCCI తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించగా.. కోచ్‌గా గంభీర్ పనిచేశారు. అయితే శ్రేయాస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ ఆదేశాలను పాటించకపోవడంతో  BCCI శ్రేయాస్ అయ్యర్‌పై వేటు వేసింది.