Home Page SliderInternational

“సూడాన్ ఘటనలు తలచుకుంటే పీడకలగా ఉంది” ఢిల్లీలో భారతీయులు

‘ఆపరేషన్ కావేరి’ ద్వారా ఇప్పటివరకు 670 మంది భారత పౌరులను సూడాన్ నుండి భారత్‌కు రప్పించింది భారత ప్రభుత్వం. వీరు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తమ భయానక అనుభవాలను నెమరు వేసుకున్నారు. సౌదీ అరేబియా మీదుగా ఢిల్లీకి చేరుకున్న వీరు మీడియాతో మాట్లాడారు. సూడాన్‌లోని ‘సూడాన్ ఆర్మీ’కి, ‘రాపిడ్ ఫోర్స్‌’కు మధ్యజరిగిన అంతర్యుద్ధం గురించి వివరించారు.   

   సుఖ్విందర్ సింగ్ అనే ఇంజనీర్ మాట్లాడుతూ తాము అక్కడ మరణశయ్యపై ఉన్నట్లు అనిపించిందని, వారంతా ఒకే రూమ్‌లో గడిపామని, బయట తుపాకీల మోత మారుమ్రోగిపోయిందని పేర్కొన్నారు. అతి కష్టం మీద 200 మంది కలిసి  బస్సుల్లో వెళ్లి ఇండియన్ ఎంబసీని కలిసామని, ఆ మార్గంలో కూడా చాలా కష్టాలు పడ్డామని తెలిపారు. తమ గుండెలపై గన్ పెట్టి ప్రశ్నలు అడిగారని, ఎప్పుడు ఎవరిని షూట్ చేస్తారో వారి మూడ్‌ని బట్టి ఉంటుందని, తాము భారతీయులమని చెప్పగా వారిని వదిలిపెట్టారని తెలియజేసారు.

భారత ప్రభుత్వం సూడాన్‌లోని భారతీయులనే కాక సహాయం అడిగిన శ్రీలంకకు చెందిన పౌరులను కూడా ఆపరేషన్ కావేరి ద్వారా కాపాడి స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది.