Home Page SliderInternational

ఇటలీలోని గారిసెండ టవర్ ఎప్పుడైనా కూలచ్చు

ఇటలీలోని గారిసెండ టవర్ కూలే ప్రమాదం ఉంది. శిథిల దశకు చేరుకున్న ఆ టవర్ చుట్టూ ప్రత్యేకమైన ఇనుప కంచెను ఏర్పాటు చేస్తున్నారు. లీనింగ్ టవర్ కూలే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఆ సిటీలో హై అలెర్ట్ జారీ చేశారు.

న్యూఢిల్లీ: ఇటలీలో ప్రఖ్యాతి గాంచిన లీనింగ్ టవర్ శిథిల దశకు చేరుకున్నది. ఆ టవర్ ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉంది. ఇటలీలోని బొలొగ్నాలో ఉన్న ఆ టవర్‌ను గారిసెండ టవర్ అని కూడా పిలుస్తారు. దాదాపు వెయ్యేళ్ల నుంచి ఆ టవర్ ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. అయితే ఇటీవల ఆ టవర్ ఎక్కువగా వంగుతోందని, దానివల్ల ఆ టవర్ కూలే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు.