లిక్కర్ స్కాంపై కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారాన్ని ప్రజలు నమ్మారన్న ఈటల
కమలాపూర్: బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారాన్ని ప్రజలు నమ్మారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం కమలాపూర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఈటల రాజేందర్ హాజరై మాట్లాడుతూ.. లిక్కర్ స్కాంపై కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారాన్ని ప్రజలు నమ్మారన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి హుజూరాబాద్‌పై కేసీఆర్ పగబట్టి, ప్రజలపై కక్ష తీర్చుకోవాలని చూశారని ఆరోపించారు. ఈటలపై ప్రజల్లో గట్టి నమ్మకముందని భావించి దెబ్బకొట్టాలని నమ్మశఖ్యం కాని వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కె.అశోక్‌రెడ్డి తదితరులు, బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

