గజ్వేల్ అసెంబ్లీ ములుగు-బండనర్సంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం బండనర్సంపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.
తూఫ్రాన్‌లో 5600 ఎకరాలు గుంజుకున్నారు. ఈ చుట్టు పక్కల ఏ ఊరులో అయినా ఎకరం కోటి, రెండు కోట్లు ఉన్న భూములను 6 లక్షలు ఇచ్చి కెసిఆర్ తీసుకున్నారు. నన్ను గెలిపించండి ఒక్క ఎకరం కూడా ఎవడు గుంజుకోలేడు. ధరణి వల్ల పేదలు కోల్పోయిన భూములు అన్నీ తిరిగి ఇస్తాం. నేను గరీబ్ వాళ్ళ బిడ్డను గరీబోళ్ల కోసం పనిచేస్తా. నెలకు 10 కేజీల బియ్యం ఇస్తాం. మూడు నెలల్లో రేషన్ కార్డులు ఇస్తాం. మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నారు. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ఉచిత విద్య అందిస్తాం.
బీజేపీ మీటింగ్‌కి పోవద్దని డబ్బులిస్తున్నారట, బెదిరిస్తున్నారట మీ అబ్బ జాగీరు కాదు. గజ్వేల్ గడ్డమీద గెలిచేది బీజేపీ. నీ అబద్ధాలని నా విద్యార్థులు, యువకులు చీల్చి చెండాడుతారు, తిప్పికొడతారు