Home Page SliderTelangana

భువనగిరి ఎమ్మెల్యేగా గూడూరి నారాయణ రెడ్డి తరపున ప్రచారంలో ఈటల

యాదాద్రి: భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరి నారాయణ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్.

వలిగొండలో రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. మామ అల్లుడు తలకాయ కిందపెట్టి కాళ్ళు పైకి పెట్టినా గజ్వేల్‌లో గెలవలేరు. డిసెంబర్ 3వ తారీఖు కెసిఆర్ దారి ఫాం హౌస్ వైపే. కెసిఆర్ జీవితమే తప్పుడు మాటలు. హలో హలో మాటతప్పుడు ఆయనకు అలవాటు. కెసిఆర్ సభల్లో పసలేదు, మాటల్లో పసలేదు. మొఖం చూసి మాట్లాడే దమ్ములేదు. కెసిఆర్‌కు మద్యం, డబ్బు, కుట్రల మీదనే నమ్మకం. మందు సీసాకు, బిర్యానీ పాకెట్‌కి హుజూరాబాద్‌లో ఘోరీ కట్టారు.

మానోరు కొట్టి సంపాదించినవి మాకే ఇస్తున్నాడు.. తీసుకుంటాం మావాడు ఈటలకు ఓటు వేసుకుంటాం అని నన్ను గెలిపించారు. మిస్టర్ కెసిఆర్ యూ అర్ ద సర్వెంట్ ఆఫ్ ద స్టేట్. బ్రాందీ షాపులు బంద్ అయితే జీతాలు కూడా ఇవ్వలేరు. రాష్ట్రం దివాళా తీసింది. ఐదున్నర లక్షల కోట్ల అప్పు చేశారు. ఒక్కో తలకాయ మీద లక్షన్నర అప్పు ఉంది. తెలంగాణను అప్పుల కుప్పగా చేశారు. వంద కోట్ల రూపాయలకు ఎకరం చొప్పున భూములు అమ్మితే తప్ప, రింగ్ రోడ్డు రూ.7,600 కోట్లకు అమ్ముకుంటే తప్ప రుణమాఫీ చెయ్యలేకపోయారు. అది కూడా వడ్డీలకు సరిపోయింది. ఎన్నికల సమయంలో ఊళ్లకు రానివ్వరు అనే భయంతో ఇచ్చారు. నాణ్యమైన ఇంగ్లీష్ విద్య ఉచితంగా అందిస్తాం. వైద్యం పేదలందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఇస్తాం. ముసలి వారిద్దరికీ పెన్షన్ అందిస్తాం. ఒక కిలో కూడ తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. నేను ఓడిపోతే ఏం బాధలేదు అని సీఎం అంటున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని మేము కొట్లాడుతున్నాం. మీకు అన్నీ పోతాయి. పవర్ లేకపోతే ఏం జరుగుద్దో మీకు తెలుస్తుంది. సచ్చేది బీఆర్‌ఎస్ పార్టీ. వచ్చేది బీజేపీ. కెసిఆర్ నీ చెంప చెళ్లుమనిపించే తీర్పు తధ్యం. నారాయణ రెడ్డికి ఓటు వేస్తే ఒక ఓటు ఆయనకు.. ఒక ఓటు బీసీ సీఎంకు వేసినట్టు. రెండు శాతం అంటూ హేళన చేస్తావా రాహుల్.

మేం తలుచుకుంటే జీవితంలో గెలవలేరు. ముప్పై ఏళ్లుగా పదకొండు శాతం ఉన్న  మాదిగ జాతి ఏబీసీడి వర్గీకరణ కోసం కొట్లాడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మందకృష్ణ నా తమ్ముడు అని చెప్పారు. ఆ సమస్య పరిష్కారం కాబోతోంది. రోడ్ల కోసం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించేందుకు మీకు అండగా ఉంటా అని హామీ ఇస్తున్నా.