చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యుంటే బాగుండేది-మాజీ ఎంపీ వ్యాఖ్యలు
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హుషారు ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఏపీలోని కాంగ్రెస్ నేతలు కూడా జోరు చూపిస్తున్నారు. తాజాగా తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే ఎన్నికలలో దేశంలోనే కాకుండా ఏపీలో కూడా కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఈజ్ బ్యాక్ అంటూ హుషారుగా ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండున్నరేళ్లు కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని, మరో రెండున్నరేళ్లు ఓబీసీలకు ఇస్తామని హామీ ఇచ్చారు. పాపం చిరంజీవికి ఆనాడు రాజకీయం తెలియక సీఎం అవలేకపోయారని వ్యాఖ్యానించారు. రోశయ్య బదులు చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యుంటే బాగుండేదన్నారు. పోనీ రోశయ్య అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి బదులైనా చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యుంటే చాలా బాగుండేదని, తనకు చిరంజీవి మంచి మిత్రుడని వ్యాఖ్యానించారు.