“జగన్ ఆ అబద్దాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే బాగుటుంది”: మంత్రి లోకేష్
ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేయడంపై మంత్రి నారా లోకేష్ సైటెర్లు వేశారు. ఏపీలో రెడ్ బుక్ తెరవకుండానే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. అయితే తమ ప్రభుత్వం తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.కాగా జగన్ తన 5 ఏళ్ల పాలనలో కేవలం 2 సార్లు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారన్నారు. మరి ఇప్పుడు నెల రోజుల వ్యవధిలోనే 5సార్లు మీడియాతో మాట్లాడారన్నారు. అయితే జగన్ తాను చెప్పే అబద్దాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్పాలన్నారు.కాగా వాటిలో నిజానిజాలను తాము ఏపీ ప్రజలకు స్పష్టంగా వివరిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు.

