పవన్ చిత్రానికి ఇది పోటీ రాదు..నాగవంశీ
టాలీవుడ్ నిర్మాత నాగవంశీ తాజా చిత్రం మ్యాడ్ స్క్వేర్ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. తమ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఒకవేళ పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం అనుకున్నట్లుగానే మార్చి 28న రిలీజ్ అయితే తమ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేస్తామని వెల్లడించారు. మ్యాడ్‌స్క్వేర్ ప్రమోషన్స్ కోసం ఆయన శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. మీడియాతో పలు విషయాలు వెల్లడించారు. హరిహరవీరమల్లు ఈ నెలలో వస్తుందో రాదో నిర్మాత వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకుంటామన్నారు.