Home Page SliderTelangana

4g, 5g సర్వీసులు లేకుంటే కష్టమే..!

4జి, 5జి సర్వీసులు లేకపోవడం వల్లే ప్రైవేట్ టెల్కోలతో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ పోటీపడలేక పోతోందంటూ ఆ సంస్థ ఉద్యోగుల యూనియన్ వ్యాఖ్యానించింది. గతంలో బీఎస్ఎన్ఎల్ నుండి పోటీ వల్ల ప్రైవేట్ సంస్థలు టారిఫ్‌లను అడ్డగోలుగా పెంచకుండా కాస్త సంయమనం పాటించేవని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని తెలిపింది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి సింధియాకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యూనియన్ ఈ మేరకు లేఖ రాసింది.