వామ్మో.. మళ్లీ భూకంపం..!
ప్రకాశం జిల్లాలో వరుసగా మూడోరోజు స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముండ్లమూరు, సింగనపాలెం, శంకరాపురం, మారెళ్ల పరిసర ప్రాంతాల్లో సోమవారం భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. గత రెండు రోజులుగా ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని గ్రామాల్లో స్వల్పంగా భూప్రకంపనలు జరుగుతున్నాయి.

