Home Page SliderPoliticsTelangana

ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది బీఆర్‌ఎస్‌ జెండానే…

టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ పేరు మార్చకుని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే, బీఆర్‌ఎస్‌ పార్టీ నినాదం  అబ్‌ కీ బార్‌ కిసాన్‌ కా సర్కార్‌ అని అన్నారు. ఈనెల 14న ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, అదే రోజున సభను కూడా నిర్వహిస్తామన్నారు కేసీఆర్‌.

దేశ పరివర్తన కోసమే భారత రాష్ట్ర సమితి ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు.. రాజకీయ పార్టీలు కాదన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళా సాధికారికత కోసం కొత్త జాతీయ విధానం అమలు చేయాలన్నారు. రాబోయేది రైతు ప్రభుత్వమే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.