లోకేష్‌పై కోడిగుడ్లు వేసింది టీడీపీ వాళ్లే: పేర్ని నాని
ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్రలో కొంతమంది ఆయనపై కోడిగుడ్లు విసిరారు.కాగా దీనిపై లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా లోకేష్ తనకు భద్రత కల్పించాలని గవర్నర్‌ను కూడా కలిశారు. అయితే దీనిపై వైసీపీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ తన భద్రత గురించి గవర్నర్‌ను కలవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లోకేష్ ఎమ్మెల్యే కూడా కాదు. సెల్ఫీ ఇవ్వలేదని టీడీపీ వాళ్లే ఆయనపై కోడిగుడ్లు వేశారని పేర్నినాని వెల్లడించారు. ముందు టీడీపీ కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పాలని ఆయన సూచించారు. టీడీపీలో పొలిట్ బ్యూరో అంటే తోతాపూరి కంపెనీ అని పేర్నినాని వ్యాఖ్యానించారు. ఏ పదవిలో ఉన్నానని వర్ల సలహాలు ఇస్తున్నారని పేర్నినాని మండిపడ్డారు.

