Home Page SliderTelangana

ధ్వంసం చేయలేదు.. ఇవిగో ఫోన్లు.. ఈడీ అధికారికి కవిత లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇవాళ వరుసగా రెండో రోజు ప్రశ్నిస్తోంది. దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లే సమయంలో, మద్దతుదారులకు, మీడియాకు ఫోన్‌ల బ్యాగ్‌ను చూపించారు. ఈడీకి ఇవాళ తాను ఫోన్లను సమర్పించబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారని… దర్యాప్తు సంస్థ నివేదికలో ఆరోపించింది. ఈడీ ముందు కవిత ఇవాళ మూడోసారి హాజరయ్యారు. మార్చి 11, మార్చి 20 తేదీలలో ఆమె రెండుసార్లు ఈడీకి వివరణ ఇచ్చారు. సెంట్రల్ ఢిల్లీలోని ED ప్రధాన కార్యాలయంలో సుమారు 18-19 గంటలు పాటు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారని కవిత దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్‍లో తనకు ఎలాంటి పాత్ర లేదని కవిత స్పష్టం చేశారు.

ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నట్టు పేర్కొన్నారు.