బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాల కలకలం
తెలంగాణాలో కొనసాగుతున్న ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. వరుసగా బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. కొండాపూర్‌లోని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉదయం 6 గంటల నుండి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. జూబ్లిహిల్స్‌లోని మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనితో ఆయన నివాసానికి భారీగా అభిమానులు, మద్దతు దారులు చేరుకుంటున్నారు. వారు చేస్తున్న వ్యాపారాలకు, కడుతున్న ట్యాక్స్‌లకు చాలా తేడాలు ఉన్నాయని, ఐటీ అధికారులు చెప్తున్నారు. ఇది బీజేపీ పార్టీ కావాలని కక్షకట్టి చేయిస్తున్న దాడులేనని అభిమానులు ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ సంస్థలను ప్రతిపక్ష పార్టీలపై దాడులకు పంపిస్తోందని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని నేతలు పేర్కొంటున్నారు.