ఏప్రిల్ 1నుండి మారనున్న ఐటీ రూల్స్..
ఆర్థిక సంవత్సరం చివరికొచ్చేసింది. ఏప్రిల్ 1నుండి కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను విధానంలో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెడుతూ రూ.12 లక్షల వరకూ పన్ను ఊరటనిచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.75 వేలు కలుపుకుని రూ.12.75 లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించనక్కరలేదు. అలాగే బ్యాంకు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వార్షిక వడ్డీ రూ.50 వేలు దాటితే వసూలు చేసేవారు. ఇప్పుడు ఈ టీడీఎస్ వసూలును రూ.1 లక్షకు పెంచారు. సీనియర్ సిటిజన్లు కానివారికి ఈ మొత్తాన్ని రూ.40 వేల నుండి రూ.50 వేలకు పెంచారు. అలాగే ఇన్‌యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నెంబర్లకు ఏప్రిల్ 1 నుండి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. యూపీఐ లైట్ వినియోగించాలంటే ఇకపై యాప్ పిన్, పాస్‌కోడ్, బయోమెట్రిక్ వంటివి వినియోగించాలి.

