Home Page SliderTelangana

హైదరాబాద్‌లో ఐటీ విప్లవం కొనసాగుతోంది

హైదరాబాద్ నగరం నైపుణ్యానికి, మానవ వనరులకు పెట్టింది పేరన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో ఒక ఉద్యమంలా, విప్లవంగా ఐటీ అభివృద్ధి చెందుతోందన్నారు. హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడాలో స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సస్టెయినబుల్ మొబిలిటీకి  ఎంతో భవిష్యత్తు ఉందని, మొబిలిటీ వ్యాలీలో స్టెల్లాంటిస్ భాగస్వామి అవడం సంతోషంగా ఉందన్నారు. వ్యాపార విస్తరణకు గానీ, ఐటీ రంగానికి గానీ ఈ నగరం ఎంతో అనుకూలంగా ఉందన్నారు. దేశంలోని ప్రతీ రెండు ఐటీ ఉద్యోగాలలో ఒకటి హైదరాబాద్‌లోనే ఉందన్నారు. పారిశ్రామిక రంగంలోనూ. ఐటీ రంగంలోనూ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.