Breaking NewsHome Page Slider

మైత్రి మూవీ మేకర్స్‌పై ఐటీ దాడులు…

టాలీవుడ్‌ టాప్ ప్రొడక్షన్‌ కంపెనీ అయిన మైత్రి మూవీ మేకర్స్‌ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఒకేసారి 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ గతంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, రంగస్థలం, సర్కారు వారి పాట, పుష్ప అనే భారీ సినిమాలను నిర్మించింది. ప్రస్తుతం ఆ సంస్థే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి భారీ బడ్జెట్‌ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి ఆ రెండు సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణాలకు సంబంధించిన ట్యాక్స్‌ చెల్లింపులు, తదితర అంశాలపై వివిధ పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.