జగిత్యాలలో RDO ఆఫీస్ లో ఐటీ రైడ్స్
జగిత్యాలలోని రైల్వే లైన్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని.. 300 మంది రైతులకు ఇచ్చే పరిహారంలో వంద మంది రైతుల పరిహారంలో అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించారు. 2019 లో ఈ కుంభకోణం జరిగినట్లు సమాచారం. సుమారు 12 మంది ఐటీ అధికారుల తనిఖీలు చేపట్టారు. జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలోని కీలక అధికారులతో పాటు మరో ఆడిటర్ సంబంధం ఉన్నట్లు ఇన్కమ్ టాక్స్ అధికారులు గుర్తించారు.

