Editorial NewsHome Page SliderLifestyleNational

కోడింగ్ తో పని లేకుండానే ఐటీ జాబ్స్

ఐటీ రంగంలో ఉద్యోగం అంటే కోడింగ్, ప్రోగ్రామింగ్ కచ్చితంగా తెలియాల్సిందే అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ కొన్ని విభాగాల్లో మాత్రం కోడింగ్/ ప్రోగ్రామింగ్లపై ప్రాథమిక అవగాహన ఉన్నా సరిపోతుంది. వారికి మంచి ఉద్యోగావకాశాలుంటాయి. అని కెరీర్ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల ఉద్యోగాలకు కోడింగ్ తో పని లేకుండా కూడా ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించవచ్చని వాటి కోసం ఈ విభాగాలలో కృషి చేయడం మంచిదని సలహాలిస్తున్నారు.

  1. బిజినెస్ అనలిస్ట్: వ్యాపార అవసరాలను అర్థం చేసుకుని, టెక్నికల్ టీమ్ కి అవసరమైన సమాచారం అందిస్తారు.
  2. ప్రాజెక్ట్ మేనేజర్: ప్రాజెక్ట్ ను నిర్వహించడంలో, బడ్జెట్, టీమ్ కంట్రోల్ చేయడంలో నైపుణ్యం ఉంటుంది.
  3. యూఐ/యూఎక్స్ డిజైనర్: యాప్, వెబ్ సైట్ వంటి వాటికి వినియోగదారుడికి అనుకూలమైన డిజైన్ రూపొందిస్తారు.
  4. టెక్నికల్ రైటర్: సాఫ్ట్ వేర్ డాక్యుమెంటేషన్, మాన్యువల్స్ రాయడంలో నిపుణులు.
  5. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ /నెట్ వర్క్ ఇంజినీర్: కోడింగ్ అవసరం లేకుండా సర్వర్లు, నెట్వర్క్లను నిర్వహిస్తారు.
  6. కస్టమర్ సపోర్ట్/ టెక్ సపోర్ట్: క్లయింట్లకు సాఫ్ట్ వేర్ వాడకంపై సాయం అందిస్తారు.
    ఇవే కాకుండా క్వాలిటీ ఎనలిస్ట్, క్యూఏ టెస్టర్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనలిస్ట్, ప్రొడక్ట్ మేనేజర్ లాంటివీ ఉన్నాయి.