మంత్రివర్గంపై వారిదే నిర్ణయం.. రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో ఎవరిని తీసుకోవాలో, ఎవరిని తీసుకోకూడదో వంటి కీలక నిర్ణయాలన్నీ అధిష్టానానివే అంటూ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ మంత్రి వర్గం భేటీ అయ్యింది. క్యాబినెట్ విస్తరణపై చర్చలేమీ రాలేదని, తాను ఎవరి పేరను ప్రతిపాదించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతల కేసులపై మాట్లాడుతూ, వారిని అరెస్టు చేయించాలనే ఉద్దేశం తనకు లేదని, చట్టప్రకారం పనిచేసుకుపోతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యం అని, మాకు వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని, ఆయనను కలవడం లేదని తెలిపారు.