Andhra PradeshHome Page Slider

 జగన్ పంచాయితీ నిధులను, పంచాయితీ కరెంట్ బిల్లులు కట్టడానికి మళ్లించడం హాస్యాస్పదం

పంచాయితీ నిధులను, పంచాయితీ కరెంట్ బిల్లులు కట్టడానికి మళ్లించడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోస్తాంధ్ర జోనల్ ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి.  రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న ధోరణిని చూస్తే బాధగా అనిపిస్తోందన్నారు.  ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో 4సం.ల వైసీపీ పాలన గురించి చెప్పే వైసీపీ నేతలు 151 ఎమ్మెల్యేల బలం ప్రజలు ఇచ్చారని చెబుతున్న మాటలు వింటుంటే విడ్డూరంగా ఉంది. సర్పంచుల హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తూoది…రాష్ట్రంలో ఉన్న సర్పంచులు , ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా మీ హక్కులు కాలరాస్తే చూస్తూ ఊరుకుంటారా సీయం గారు ?  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కానీ, వారి ఎమ్మెల్యేలకుగాని నిధులు మంజూరుకు సంతకం పెట్టె హక్కులేదన్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో సర్పంచుల కోట్ల నిధులను దారిమళ్ళించిన సంగతి ప్రజలు చూస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి మీరు 5 సంవత్సరాల తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే. ప్రజలు , ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పర్మినెంట్‌గా ఉంటారని, మరో 9 నెలలలో మిమ్మల్ని ప్రజలు సాగనంపుతారని పేర్కొన్నారు. 7650 కోట్ల పంచాయతీ నిధులు దారి మళ్లించి ఏమి చేశారో శ్వేతపత్రం ద్వారా విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. 2019 నుంచి గ్రామ పంచాయతీ కరంటు బిల్లులు ఎన్నివున్నాయో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలకు సైతం పంచాయతీ నిధులు చెల్లించడం లేదు .

వైసీపీ నేతలకు నీతి నిజాయితీ ఉంటే వలంటీర్స్ వ్యవస్థను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో వలంటీర్స్ ఉద్యోగాలను రెగ్యులైజ్ చేయకపోతే తిరగబడాలని పిలుపునిచ్చారు. అమరావతి రైతులు , వారి హక్కులను గుర్తించని మీ ప్రభుత్వం వారి భూములను ఉపయోగించుకోనే హక్కు మీ ప్రభుత్వానికి లేదు . ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లో ఇప్పట్టివరకు ఇళ్లను పూర్తి చేయలేని ముఖ్యమంత్రి పేదలకు 50వేల ఇళ్లను ఇస్తామంటే పేదలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. బీజేపీ , యన్డీఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి రైతులకు  న్యాయం చేస్తాం. రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు సంబంధించిన గైడ్ లైన్స్ వచ్చాయి, వాటిని త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి జోనల్ పర్యటనలో భాగంగా కోస్తా జోన్ సమావేశం గుంటూరులో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే ఆమె రాయలసీమ పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు విష్ణు వర్థన్ రెడ్డి.