“వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి ఇది ఆక్సిజన్ మాత్రమే”:సీఎం చంద్రబాబు
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించింది. కాగా దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు. సీఎం మాట్లాడుతూ.. ఏపీకి భారీగా నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడం అభినందనీయం అన్నారు. అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించడం.. వెంటీలేటర్‌పై ఉన్న ఏపీకి ఇది ఆక్సిజన్ మాత్రమేనని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా ఏపీ అభివృద్ధి కోసం కూటమి కలిసే ముందుకు సాగుతుందని సీఎం వెల్లడించారు. కాగా దీనిపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే తనకు స్పష్టత ఇచ్చారన్నారు. ప్రతిపక్ష నాయకుడికి సభకు వచ్చే ధైర్యం లేదన్నారు. ఆయన రాష్ట్రానికి ఏమి చేయలేదు కాబట్టే అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. అయితే తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలన్నదే మా తపన అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని సీఎం పేర్కొన్నారు.

