Home Page SliderTelangana

కవిత సవాళ్లు విసరడం సరికాదు..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై తీహార్ జైలు బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యాలపై మాజీ మంత్రి టీజీ వెంకటేష్ స్పందించారు. కవిత మాట్లాడే భాష అభ్యంతకరంగా ఉందని.. సవాళ్లు విసరడం సరికాదన్నారు. కేటీఆర్, హరీష్ రావును కూడా కావాలంటే జైల్లో వేస్తారని హాట్ కామెంట్లు చేశారు. ఒక పార్లమెంట్ కమిటీ ఛైర్మన్గ్ గా ఉన్నప్పుడు గతంలో తన మీద హత్యాయత్నం కేసు పెట్టారని.. తనపై పెట్టిన 10 కేసులు కూడా ఫ్రూవ్ కాలేదన్నారు. మరోవైపు హైదరాబాద్ లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తే ప్రజలందరూ స్వాగతిస్తామన్నారు. ఏపీలో కూడా పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని.. సీఎం చంద్రబాబు కూడా చెరువులను పరిరక్షించే కార్యక్రమం మొదలుపెట్టాలన్నారు.