గ్యారెంటీలను గాలికొదిలేసి.. శ్వేతపత్రాలిస్తామంటే కుదరదు!?
రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాకుండా.. శ్వేతపత్రాలతో కాలం గడిపేద్దామంటే కుదరంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో హామీలిచ్చిన కాంగ్రెస్, కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తుందా? అంటూ ఆయన ట్విట్టర్ సాక్షిగా విమర్శలు గుప్పించారు.

