Home Page SliderTelangana

ఆరు గ్యారంటీలకు నిధులు ఎలా తెస్తారో స్పష్టత లేదన్న: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలకు నిధులు ఎలా తెస్తారో స్పష్టత లేదన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం చూస్తే హామీల అమలుపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ, రైతుబంధు మాటలే లేవని పేర్కొన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీపై ప్రకటన అన్నారు. ఏమైంది? అని ప్రశ్నించారు. హామీల అమలుకు కొత్త ప్రభుత్వానికి వంద రోజులు సమయం ఇచ్చి.. ఆపై ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని లక్ష్మణ్ వెల్లడించారు.