Home Page SliderNational

అది ఇండియా కూటమి కాదు… అహంభావుల కూటమి-మోడీ విసుర్లు

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం బీహార్‌లోని మిత్రపక్షాలతో సమావేశమైనప్పుడు ప్రతిపక్ష కూటమిని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాన్ని సూచించారు. విపక్ష కూటమి ఇండియా కాదని… “ఘమండియా” అని అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. విపక్ష కూటమిని ఇండియా అని పిలుస్తోండటంతో ప్రధాని మోడీ తీవ్రంగా దాడి చేస్తున్నారు. యూపీఏను రీ బ్రాండ్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మోడీ దుయ్యబట్టారు. ‘పేదలకు వ్యతిరేకంగా వారు ఎలా కుట్రలు పన్నుతున్నారో దాచిపెట్టేందుకు యూపీఏను ఇండియాగా పేరు మార్చుకున్నారు… ఇండియా పేరు తమ దేశభక్తిని చాటుకోవడానికి కాదు, దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో’ అని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు.

గత నెలలో బెంగుళూరులో జరిగిన సమావేశంలో, 26 ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అనే కూటమి పేరుతో ప్రధాని మోడీని, బీజేపీని ఎదుర్కోవాలని నిర్ణయించాయి. దాడికి గురవుతున్న ‘ఇండియా’ ఆలోచన కోసం తమ పోరాటానికి పేరు ప్రతీక అని పార్టీ నేతలు చెప్పారు. ఇండియాకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడితే, ఎవరు గెలుస్తారో మీకు తెలుస్తోందంటూ ఇటీవల రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కూటమి ఇండియా పేరు పెట్టిన తర్వాత మోడీ కూటమిపై దాడి చేస్తూనే ఉన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో పేరులో “ఇండియా” ఉందని, తీవ్రవాద సంస్థలను కూడా ఉటంకిస్తూ విమర్శలు గుప్పించారు. కూటమిని ఇండియాతో పిలవమని, యూపీఏనే పిలుస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.


ఎన్డీఏ ఎంపీలు, కుల ఆధారిత రాజకీయాలకు అతీతంగా ఎదగాలని మరియు “మొత్తం సమాజానికి నాయకులుగా మారాలని” ప్రధాని మోడీ సూచించారు. గత ఏడాది బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆర్జేడీ, కాంగ్రెస్‌లను మళ్లీ ఆదరించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురించి ప్రస్తావిస్తూ, సుస్థిర ప్రభుత్వం కోసం బీజేపీ గొప్పతనానికి తానే ఉదాహరణ అని ప్రధాని అన్నారు. “నితీష్ కుమార్‌కు తక్కువ సీట్లు ఉన్నందున ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేనప్పటికీ బీజేపీ ముఖ్యమంత్రిని చేసిందన్నారు. ఇది ఎన్డీఏ ‘త్యాగ్ భావన’ (త్యాగం)” అని ఆయన చెప్పారు. అకాలీదళ్‌ను “తమ స్వప్రయోజనాల కారణంగా విడిచిపెట్టిన” మిత్రపక్షాలకు ఉదాహరణ అన్నారు. ప్రభుత్వ పథకాలను “ఎన్డీఏ ప్రభుత్వ పథకాలు”గా అభివర్ణించాలని, ఎన్డీఏ మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని అందించగలదని హైలైట్ చేయాలని ప్రధాని ఎంపీలకు సూచించారు. ఎన్డీఏ సహకారాన్ని ప్రోత్సహించడానికి, హైలైట్ చేయడానికి సోషల్ మీడియాలో వీడియోలను పంచుకోవాలని సూచిస్తూ, PM మోడీ MPలకు కొన్ని బాధ్యతలు కేటాయించారు.