Andhra PradeshTelangana

ఎన్టీఆర్ భవన్‌లో నవచండీ యాగం

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో నేడు దశ మహా విద్యాపూర్వక నవ చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీ, తెలంగాణలో పార్టీ భవిష్యత్‌తో పాటు లోక కళ్యాణం కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో చండీయాగాన్ని వేద పండితులు నిర్వహిస్తున్నారు. ఈ చండీయాగానికి తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. చండీయాగం ముగింపు రోజున పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.