Andhra PradeshHome Page Slider

“చంద్రబాబును చంపేది ఆయన భార్యే”: ఏపీ డిప్యూటీ సీఎం

స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జైలులో అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.ఈ నేపథ్యంలోనే వారు జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. కాగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబును చంపితే ఆయన భార్య భువనేశ్వరినే చంపుతారని సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రినే పదవి నుంచి దించి ..చంపితేనే భువనేశ్వరి మేనేజ్ చేసుకున్నారన్నారు. అయితే ఆమెకు,కొడుకు లోకేష్‌కు పదవీకాంక్ష ఉంది కాబట్టే..అన్నంలో ఏదో కలిపి పెట్టి చంద్రబాబును చంపే కార్యక్రమం చేస్తున్నారేమో? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై నిపుణులైన డాక్టర్లు నివేదిక ఇస్తుంటే..చంద్రబాబు కుటుంబ సభ్యుల తప్పుడు ఆరోపణలు ఏంటి? అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రశ్నించారు.