పొలాల్లో చేపలు పట్టిన రైతులు –పాల పేకెట్లు పట్టిన ప్రజలు
చేపలు చెరువుల్లో, నదుల్లో పట్టడం మామూలే. కానీ పొలాలలో చేపలు పట్టడం అనేది విచిత్రంగానే ఉంది. సత్తుపల్లిలోని గత రెండు రోజులుగా పడిన వానలకు చేపలు ఏకంగా పొలాలలోకి వచ్చిపడ్డాయి. ఇంకేముంది సత్తుపల్లి జనాలు పొలాలకు పరుగులు పెట్టారు. వలలతో పొలాలకు వెళ్లి ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడిన చేపలను పట్టేశారు. కష్టపడకుండా తమ పొలంలోకే వచ్చి పడిన చేపలను చక్కగా పట్టేసుకుని వండుకున్నారు. అలాగే మచలీపట్నంలో కూడా వానలకు ఒక పాల పేకెట్ల వ్యాన్‌లోంచి పడిన పాలపేకట్ల ట్రేలు వరద నీటిలో కొట్టుకొచ్చాయట. దీనితో వరద నీటిలో పోయి మరీ దొరికినన్ని పాలపేకట్లు చేతుల నిండా పట్టుకెళ్లిపోయారు. వరదలు, వర్షాల వల్ల ఓ పక్క ఉత్తర భారత దేశంలో ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చేపలు, పాలపేకెట్లతో ప్రజలు బాగానే ఖుషీ చేసుకుంటున్నారు.