Home Page SlidermoviesNational

‘మా నాన్న వల్లే నాకు పెళ్లంటే భయం’.. స్టార్ హీరోయిన్

‘ప్రేమలో పడితే బాగానే ఉంటుంది, కానీ పెళ్లంటేనే భయం’ అని అభిప్రాయం వ్యక్తం చేసింది స్టార్ హీరోయిన్ శృతిహాసన్. ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ తనకు రిలేషన్ షిప్స్ అంటే ఇష్టమే కానీ, పెళ్లి చేసుకుని ఎక్కువ అటాచ్‌మెంట్ పెట్టుకోవాలంటే భయంగా ఉంటుందని చెప్పింది. దీనికి కారణం తన తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక అని పేర్కొంది. “మా అమ్మానాన్నలు ప్రపంచంలోనే అందమైన జంటగా భావించానని, వారిద్దరూ కలిసి పనిచేసుకునేవారని, సంతోషంగా, సరదాగా ఉండేవారు. కానీ ఒకరోజు వాళ్లిద్దరూ విడిపోవడంతో మా జీవితాలు మారిపోయాయి. కలిసుండడానికి ప్రయత్నించాం. కానీ కుదర్లేదు. అందుకే బలవంతంగా కలిసుండడం కన్నా విడిపోతేనే సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నారు” అని ఈ ఇంటర్యూలో పేర్కొంది. ఇటీవల తన లవర్ శాంతను హజారికకు బ్రేకప్ చెప్పిన శృతి హాసన్ సోషల్ మీడియాలో అతనితో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసింది.