విశ్వరూప సభకు ప్రధాని మోడీ రావడం గర్వకారణం
పంజగుట్ట: మాదిగ, మాదిగ ఉప-కులాలకు చేయూత నిచ్చేందుకు, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రధాని మోడీ స్పందించడం గర్వంగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. 60 ఏళ్ల నిరీక్షణ, 30 ఏళ్ల ఉద్యమ సంకల్పం ప్రధాని తీసుకునే నిర్ణయంలో, ఇచ్చే సందేశంపై ఆధారపడి ఉందన్నారు. ఈ నెల 11వ తేదీన జరగబోయే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న మాదిగ విశ్వరూప మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సభకు మోడీ జీ రావడం గొప్ప విషయమన్నారు. ఈ నెల 11న (శనివారం) జరిగే బహిరంగ సభకు ప్రధాని హాజరుకానున్నారు.

