మూడు రోజుల పాటు వానలే వానలు
ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. అయితే, నేటి నుండి మూడు రోజుల పాటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. తీవ్ర అల్ప పీడనం వాయుగుండంగా మారిందని పేర్కొంది. ఇవాళ తీరం దాటే అవకాశం ఉండటంతో ములుగు, భూపాలపల్లి, కొత్త గూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉందని హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంన గర్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైద సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబా మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.