ఆఫీసుకు నో అంటున్న ఐటీ ఎంప్లాయిస్
కరోన కారణంగా అన్నీ ఐటీ సంస్థలు తమ ఎంప్లాయిస్‌కు వర్క్‌ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆఫీసుకు రావాలని కంపెనీలు ఉత్వర్వులు జారీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు వర్క్‌ఫ్రం హోంకు అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని ఒత్తిడి చేస్తే రిజైన్ చేసేందుకు సిద్ధమంటున్నారట. దాదాపు 88 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు రమ్మని చెబితే ఉద్యోగాలకు రిజైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ చేసిన ఓ సర్వేలో తేలింది. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల్లో 46 శాతం మంది వర్కింగ్ మదర్సే ఉన్నారట. ఇప్పటికే మూడు రోజులు ఆఫీసు మాత్రమే కంపెనీకి రావాలని ఆప్షన్ ఇచ్చిన కంపెనీలు ఇక నుండి పూర్తిగా ఆఫీసుకు రావాల్సిందే అనే ఆదేశాలు ఇవ్వడంతో…ఎక్కువ మంది రిజైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.