శ్రీవాణి టికెట్ల జారీ ఇక సులభతరం
తిరుమల శ్రీవారి దర్శనంలో కీలక దర్శన టికెట్లయిన శ్రీవాణి టికెట్ల జారీ ప్రక్రియను టిటిడి మరింత సులభతరం చేసింది.గతంలో శ్రీవాణి టికెట్ల కోసం రెండు మూడు రోజులకు పైగా సమయం పట్టేది.ఇప్పుడా అవస్థలకు చెక్ పెడుతూ టిటిడి నిర్ణయం తీసుకుంది .కేవలం నిముషమంటే నిముషం వ్యవధిలోనే శ్రీవాణి టికెట్లు జారీ అయ్యేలా మార్గదర్శకాలను రూపొందించి అమలు పరుస్తుంది. దీని వల్ల టిటిడికి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది.ఒక్కో శ్రీవాణి టికెట్ ధర రూ.10వేలు గా నిర్ణయించారు. అయితే టికెట్ల జారీ విషయంలో అలసత్వం నెలకొనడంతో ఈ తరహా టికెట్ల పట్ల భక్తులు ఆసక్తికనబరిచే వారు కాదు.నిత్యం ఆఫ్ లైన్‌లో 900లకు పైగా టికెట్లను జారీ చేస్తున్నారు.తాజా నిర్ణయం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో బుకింగ్ చేసుకునే వెసులుబాటు వచ్చింది.