Home Page SliderNational

NEET పేపర్ లీక్ విచారణ కమిటీలో ఇస్రో మాజీ ఛైర్మన్

ఎన్‌టీఏ  నిర్వహించిన నీట్ పేపర్ లీకేజ్ వివాదం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. అందుకే దాని పనితీరు సమీక్షించడానికి, పరీక్షలను సజావుగా నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇస్రో మాజీ ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ నేతృత్వం వహించబోతున్నారు. ఇంకా ఈ కమిటీలో ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరక్టర్ రణదీప్ గులేరియా, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ రామమూర్తి, హెచ్‌సీయూ వీసీ బి.జె.రావు, కర్మయోగి భారత్ కో ఫౌండర్ పంకజ్, ఐఐటీ ఢిల్లీ డీన్ ఆదిత్య, కేంద్ర విద్యాశాఖ జనరల్ సెక్రటరీ గోవింద్ సభ్యులుగా ఉన్నారు. నీట్ పరీక్ష అవకతవకలపై విచారణ జరిపి, పరష్కారాలు తెలియజేసే నివేదికను వీరందరూ కలిసి మూడు నెలల్లో సమర్పించనున్నారు.