Home Page SliderNationalNews

ఇస్రో వందో ప్రయోగం గ్రాండ్ సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. శ్రీహరికోట నుండి నేటి ఉదయం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-15 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో ప్రయోగించిన నేవిగేషన్ ఉపగ్రహాలలో ఇది రెండవది. వైమానిక, సముద్ర నేవిగేషన్ల సేవల కోసం ఇది ఉపయోగపడుతుంది. పదేళ్లపాటు ఈ శాటిలైట్ సేవలందించగలదని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ఆయన ఛైర్మన్ అయ్యాక జరిగిన తొలి ప్రయోగం, ఈ సంవత్సరం భారత్ నుండి మొదటి అంతరిక్ష ప్రయోగం ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకూ ఇస్రో శ్రీహరి కోట నుండి ప్రయోగించిన 100 శాటిలైట్లలో పది మాత్రమే విఫలమయ్యాయని, అన్నీ విజయవంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

Breaking news: అత్త‌మామ‌ల వేధింపులు భ‌రించ‌లేక‌…!