Home Page SliderInternationalNews

ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం..

ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య 6 నెలలపాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఏడాదికి పైగా యుద్ధంతో నలిగిపోతున్న పశ్చిమాసియాలో శాంతి నెలకొంది. దీనిపై భారత విదేశాంగ శాఖ సంతోషం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయని, ఉద్రిక్తతలు తగ్గి, సంయమనం పాటించాలని, దౌత్యపరమైన మార్గాలలో ప్రయాణం కొనసాగించాలని భారత అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ కాల్పుల విరమణ 60 రోజుల పాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ ఒప్పందం లెబనాన్ పైనే ఆధారపడి ఉంటుందని, ఉల్లంఘించకుండా ఉండాలని స్పష్టం చేశారు.