Home Page SliderInternational

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 35 మంది మృతి

గాజా నగరంలోని షుజాయే పరిసరాల్లోని నివాస భవనాలపై ఇవాళ ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 35 మంది పాలస్తీనియన్లు మరణించారు. 55 మంది గాయ పడ్డారు. 80 మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. తీవ్రంగా గాయపడిన డజన్ల కొద్దీ మందిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గత కొన్ని వారాలుగా గాజాలోని షజయ్యి, జబాలియా, ఖాన్ యూనిస్ వంటి ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్స్ మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడుల కారణంగా గాజాలో మానవతా సంక్షోభం మరింత దిగజారిపోయింది. ఈ దాడులను “హమాస్ ఉగ్రవాద లక్ష్యాలపై దృష్టి సారిస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి “సామూహిక శిక్ష”గా అభివర్ణించింది.