ఇదేమీ మర్డర్ కేసు కాదు కదా …ఆర్జీవి
ఏపి సీఎం,డిప్యూటీ సీఎం,మంత్రి నారా లోకేష్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేశాడన్న కేసులో ఏపి పోలీసులు బాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు వెంటాడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పలు మీడియా ఛానెళ్లు ఆయన పారిపోయారని ప్రసారం చేయడంతో ఎట్టకేలకు ఆయన ఓ వీడియోని రిలీజ్ చేశారు.తానెక్కడికీ పారిపోలేదని,ఎవరి మంచం కిందా దూరలేదని, పోలీసులకు,ప్రభుత్వానికి చేతనైతే తనని పట్టుకోవాలని కోరారు.కేసులో అర్జెన్సీ లేకపోయినా ఎందుకు వెంటపడుతున్నారో తనకి తెలియాలన్నారు.ఎప్పుడో ఏడాది కిందట పెట్టిన పోస్ట్‌ల పట్ల ధర్డ్ పార్టీ ఫిర్యాదు మేరకు తనని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెంటపడటం విచిత్రంగా ఉందన్నారు.తానెవరి మీదైతే పోస్ట్ చేశానో వారికి లేని దూల …ధర్డ్ పార్టీ ( మద్దిపాడు టిడిపి నాయకుడు,ఫిర్యాదు దారుడు) కి దేనికని ప్రశ్నించారు.తాను కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను అని వాటిని పూర్తి చేయకపోతే కోట్లలో నష్టం వాటిల్లుతుందని, ఆ నష్టంతో పోల్చుకుంటే తనపై నమోదైన కేసు చాలా చిన్నదని, అయినా తన విధులకు ఆటంకం కలిగించడం కరెక్ట్ కాదన్నారు. ఏదైనా విచారణ ఉంటే వర్చువల్ గా మాట్లాడతానన్నారు.ఇదేమీ మర్డర్ కేసు కాదు కదా… ఏడాది జైలు శిక్ష ఉన్న కేసు పెట్టి…వెంటపడతాను అంటే నేను మాత్రం ఎలా దొరుకుతాను అనుకున్నారు…అని ప్రశ్నల వర్షంతో వీడియో రిలీజ్ చేశారు.