Home Page SliderInternational

ఇషాన్ సెంచరీ కొట్టి, ‘బర్తడే గిఫ్ట్’ ఇవ్వాలి

మంగళవారం(జూలై18) టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మను బర్తడే బాయ్ ఇషాన్‌కు గిఫ్ట్ ఏమిస్తారని అడిగారట జర్నలిస్టులు. దీనికి సమాధానంగా ఇవ్వడానికేం లేదు, అతడే సెంచరీ కొట్టి టీమిండియాకు బర్తడే గిఫ్టు ఇవ్వాలంటూ సమాధానమిచ్చారు రోహిత్. వెస్టిండీస్‌తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇషాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదట. అతడు బ్యాటింగ్‌కు వచ్చిన కొద్ది సేపటికే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేశారు. అప్పుడు 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత్. ఇప్పుడు జరుగబోయే రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఇషాన్‌కు సెంచరీ కొట్టే ఛాన్స్ రావచ్చు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఇది 500 వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.