ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 126 బంతుల్లోనే కిషన్ రెండో సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో దుమ్ము లేపాడు. ఫోర్లు సిక్సర్లతో 146 పరుగులు చేయడం విశేషం. 131 బంతుల్లో 210 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 37 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ 92 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. వరల్డ్ వైడ్‌గా 9వ క్రికెటర్‌గా చరిత్రలోకెక్కాడు. భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన 4వ క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. వన్డేల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ మూడుసార్లు డబుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత గప్తిల్, సెహ్వాగ్, గేల్, ఫకర్ జమాన్, సచిన్ డబుల్ సెంచరీలు చేశారు. 2021లో ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌లో ఇషాన్ కిషన్‌కు ఇదే మొదటి సెంచరీ… ఇక ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన ఇషాన్ 453 పరుగులు సాధించాడు.