మాల్దీవుల మనసు మారడానికి ఇదే కారణమా?
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు తత్వం అర్థమయ్యింది. నిన్నమొన్నటి వరకూ చైనా అండ చూసుకుని రెచ్చిపోయిన ముయిజ్జు ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చారు. గతంలో ఇండియా ఔట్ అంటూ స్లోగన్లు ఇవ్వడం, ఒక్క భారత సైనికుడు కూడా మాల్దీవులలో ఉండకూడదని హుకుం జారీ చేశారు అధ్యక్షుడు. చైనా పంచన చేరి, భారత్‌ను తిట్టిపోసారు. వారి చర్యలతో భారత్ సహాయంలో కోత పెట్టింది. బడ్జెట్‌లో కోత పెట్టింది. ఇప్పుడు 28 ద్వీపాలను భారత్‌కు అప్పగించారు. కనీసం మంచి నీళ్లకు, కూరగాయలు, పండ్లకు కూడా భారత్ మీద ఆధారపడుతున్నారు. తర్వాత భారత్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకి నిజం తెలిసొచ్చింది. మాల్దీవులకు ఏదీ కావాలన్నా భారతే సహాయం చేసేది. విదేశాంగమంత్రి జైశంకర్, ప్రధాని మోదీ తీసుకున్న చర్యల వల్ల మళ్లీ ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు గాడిలో పడ్డాయి.

