Home Page SliderNational

హర్యానాలో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తు లేనట్లేనా..?

హర్యానాలో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తు లేనట్లేనా..బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య పొత్తులు కొలిక్కి రాలేదనిపిస్తోంది. సోమవారం 20మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఆప్ పార్టీ వ్యవహారంతో ఈ విషయం నిజమే అనిపిస్తోంది. నామినేషన్లకు గడువు ఈనెల 12 వరకే ఉండడంతో త్వరపడుతున్నారు. కాంగ్రెస్, ఆప్‌ల మధ్య సీట్ల కేటాయింపులపై స్పష్టత లేన్నట్లు స్పష్టమైంది. ఆప్ పార్టీ హర్యానా ఉపాధ్యక్షుడు అనురాగ్ ధండా, శర్మ, వికాశ్ నెహ్రా, బిజేందర్ వంటి హేమేహేమీలను బరిలో దింపింది ఆప్. హర్యానా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సుశీల్ గుప్తా ఈ సాయంత్రానికి కూడా ఎలాంటి సమాచారం కాంగ్రెస్ నుండి రాకపోతే మొత్తం 90 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 5నే పోలింగ్ కావడంతో పలుసార్లు కాంగ్రెస్, ఆప్‌ల మధ్య చర్చలు జరిగినా సీట్ల విషయం తేలలేదు. ఆప్ 10 సీట్లు డిమాండ్ చేస్తుండగా, 7 మాత్రమే ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.