“నెయ్యిలో కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా”?.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నలవర్షం
ఏపీ ప్రభుత్వానికి కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు ప్రశ్నలవర్షం కురిపించింది. మాజీ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి పిటిషన్‌పై నేడు విచారణ నిర్వహిస్తోంది సుప్రీంకోర్టు. లడ్డూకు వాడిన నెయ్యిపై కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించండి? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. లడ్డూలను ముందుగానే ల్యాబ్‌కు ఎందుకు పంపలేదు? కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ పేర్కొంది. కల్తీ నెయ్యి వాడకంపై సాక్ష్యాలు లేవని, మైసూర్ లేదా ఘజియాబాద్ ల్యాబ్‌ల నుండి సెకండ్ ఒపినియన్ ఎందుకు తీసుకోలేదు?. ఇతర సప్లయర్ల నుండి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కల్తీ నెయ్యి విషయంలో ఆధారాలు లేవంది. విచారణ జరగకముందే కల్తీ ఆరోపణలు చేయడం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లను ఎందుకు వాడుకోలేదు? అని ప్రశ్నలు కురిపించింది.

లడ్డూ నాణ్యతపై భక్తులు అనుమానం వ్యక్తం చేశారని రాష్ట్రప్రభుత్వం తరపు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా పేర్కొన్నారు. అనుమానం ఉంటే సెకండ్ ఒపినియన్ తీసుకోవాలని, అంతేకానీ భక్తుల మనోభావాలతో ఆడుకోకూడదని ధర్మాసనం పేర్కొంది. నెయ్యి కల్తీ జరగలేదని టీటీడీ ఉద్యోగులు ఎలా చెప్పారని ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగుల జవాబులకు, ముఖ్యమంత్రి సెప్టెంబర్ 18న లడ్డూపై చేసిన వ్యాఖ్యానాలకు స్పష్టత కావాలని కోరింది ధర్మాసనం. నెయ్యి కల్తీ జరిగిందని టీటీడీ నిర్థారణ చేయవలసి ఉంది. సరైన పరిశోధన చేయకుండా ముఖ్యమంత్రి ప్రజలతో వేదికపై కల్తీ నెయ్యి లడ్డూ తయారీకి వాడారని ఎలా ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. తదుపరి విచారణను అక్టోబరు 3నాటికి వాయిదా వేశారు.

