Andhra PradeshHome Page Slider

ఏపీలో ముందస్తు ఎన్నికలతో పార్టీలకు ముప్పు పొంచి ఉందా?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఏపీలో అధికార పక్షం ముందస్తు ఎన్నికలు జరగబోవని స్పష్టం చేసింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలతో ఏపీలో ఏ పార్టీలు లాభపడతాయో..ఏ పార్టీలు నష్టపోతాయో తెలుసుకోవాల్సివుంది. కాగా ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్తామంటున్న టీడీపీ,జనసేన,బీజేపీ అసలు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవలేదనే చెప్పాలి.

ఎందుకంటే టీడీపీ నేత నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఇంకా పూర్తవలేదు. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షలు కూడా పూర్తిస్థాయిలో నిర్వహించలేదు.మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలోనే వారాహి యాత్రను ప్రారంభించి ఇప్పుడిప్పుడే  ప్రజల్లోకి వెళ్తున్నారు. కాగా బీజేపీ,కమ్యూనిస్ట్ పార్టీలు అసలు ఏపీలో ఆ పార్టీలు ఉన్నాయనే అవగాహన కూడా ప్రజలకు కల్పించడం లేదు. అయితే అధికార వైసీపీ పార్టీ గడపగడపకు పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నప్పటికీ ఎన్నికలపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళితే ఏపీలోని అన్ని పార్టీలకు ముప్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.